: నిషిత్ రోడ్డు ప్రమాదంలో మరో కోణం!
ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి. జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొన్న ఘటనలో నిషిత్ తో పాటు అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. తాము ప్రయాణిస్తున్న కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో... కారు వేగాన్ని నిషిత్ పెంచాడని, ఆ తర్వాత స్టీరింగ్ ను నియంత్రించలేక పిల్లర్ ను ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు.
అయితే ప్రమాదానికి సంబంధించి మరో అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన చోట ఓ భవన నిర్మాణం జరుగుతోంది. దీంతో, అక్కడ నుంచి తవ్విన మట్టి, బండరాళ్లను లారీల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ మట్టి, చిన్న చిన్న రాళ్లు రోడ్డు మీద పడ్డాయి. వేగంగా వచ్చిన నిషిత్ ఆఖరి క్షణంలో వాటిని చూసి, పక్కకు తప్పించబోయాడని... కానీ, కారును అదుపు చేయలేక పిల్లర్ ను ఢీకొట్టాడని మరికొందరు భావిస్తున్నారు.