: ఇక కలసి పోరాటం... పవన్ కల్యాణ్ తో తమ్మినేని వీరభద్రం భేటీ
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిశారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై పవన్ తో తమ్మినేని చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవలి తన పాదయాత్ర విశేషాలను, వివిధ ప్రాంతాల్లో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, పాలకులు విస్మరించిన సమస్యలను గురించి కూడా ఆయన పవన్ తో చర్చించినట్టు సమాచారం. ప్రజా సమస్యలపై జనసేన పోరాటానికి తాము మద్దతిస్తామని వెల్లడించిన ఆయన, కలిసి పోరాడే అంశంపైనా మాట్లాడినట్టు సీపీఎం వర్గాలు వెల్లడించాయి. పవన్ సైతం వీరభద్రం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని తెలిసింది.