: మంత్రి అయ్యన్నపాత్రుడికి అస్వస్థత... రుయా ఆసుపత్రికి తరలింపు
ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరులోని నిషిత్ నారాయణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చేరుకుంటున్న క్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఎందుకు అస్వస్థతకు గురయ్యారు, ఆయన ప్రస్తుత పరిస్థితి ఏంటి? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.