: శభాష్ రితీష్.. అత్యంత గొప్ప సినిమాను తీస్తున్నావు: రామ్ గోపాల్ వర్మ


రూ. 225 కోట్ల బడ్జెట్ తో మరాఠా యోధుడు శివాజీ సినిమాను తెరకెక్కించనున్న బాలీవుడ్ నటుడు రీతీష్ దేశ్ ముఖ్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశాడు. బాహుబలి ఘన విజయం తర్వాత ఆ స్థాయి సినిమాను రితీష్ తీయబోతున్నాడన్న వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. బాహుబలి కన్నా శివాజీ కథలో ఎక్కువ హీరోయిజం ఉంటుందని... ఇది నిజ జీవిత కథ కావడంతో మరింత థ్రిల్లింగ్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు. భరతమాత ముద్దు బిడ్డగా, అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా దేశం మొత్తానికి శివాజీ తెలుసని చెప్పాడు. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపాడు. బాహుబలి సినిమాతో ఆంధ్రప్రదేశ్ ఎలా గర్వించిందో, శివాజీ సినిమాతో మహారాష్ట్ర కూడా అలానే గర్విస్తుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News