: ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి మారనున్న విమాన టికెట్ ధరలు
ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి విమాన టికెట్ ధరలు మారనున్నాయి. రీజినల్ ఎయిర్ కనెక్టవిటీ స్కీమ్ కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి విమాన ఛార్జీలను, విమానయాన సంస్థలకు ఇచ్చే సబ్సిడీని మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా ఈ ధరల్లో మార్పు ఉంటుంది. విమాన ఛార్జీలను ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తామని... ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, రూపాయి, డాలర్ ఎక్స్ఛేంజ్ రేటును పరిగణనలోకి తీసుకుంటామని సివిల్ ఏవియేషన్ శాఖ తెలిపింది.
గత నెలలోనే తొలి ఉడాన్ విమానం గాల్లోకి ఎగిరింది. ఉడాన్ కింద గంట ప్రయాణానికి టికెట్ ధర రూ. 2500.