: నాన్నా! నిషీ ఎక్కడున్నావ్... నారాయణ ఆఖరి ఫోన్ సంభాషణ!


కడుపులో పెట్టుకుని పెంచిన బిడ్డ మరణం ఏపీ మంత్రి నారాయణను తీవ్రంగా బాధిస్తుండగా, తన కుమారుడితో ఆయన చివరి మాటలు ఇప్పుడు అందరి కంటా నీళ్లు తెప్పిస్తున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిషిత్ తో నారాయణ మాట్లాడారు. "నాన్నా నిషీ ఎక్కడున్నావ్... ఇప్పుడు రాత్రి 11 గంటలవుతోంది. ఇంకా ఇంటికి వెళ్లలేదా? భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. ఇక్కడ నేను బిజీగా ఉన్నా. రెండు రోజుల్లో ఇంటికొస్తా. కారు నడిపేటప్పుడు జాగ్రత్త" అంటూ ప్రేమగా మాట్లాడారు. త్వరగా ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఆపై నాలుగు గంటల వ్యవధిలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

  • Loading...

More Telugu News