: 'నన్ను దత్తత తీసుకోవా?' అంటూ తల్లి భర్తను అడిగిన బాలుడు... ఉద్వేగానికి గురైన సవతి తండ్రి... వీడియో చూడండి!


నన్ను దత్తత తీసుకోవా? అంటూ సవతి కుమారుడు కోరిన కోరిక ఆ తండ్రిని కంటతడిపెట్టించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక హాస్టల్ లో కలని అనే బాలుడు చదువుకుంటున్నాడు. ఆ బాలుడి 10వ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని తల్లి, తన భర్తతో కలిసి హాస్టల్ కు వచ్చింది.

ఈ సందర్భంగా ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద సహాయాన్ని నాకు చేస్తావా? నన్ను దత్తతు తీసుకుంటావా?’’ అంటూ రాసిన లేఖను సవతి తండ్రి ముందు చదివి వినిపించాడు. అతని లేఖ విన్న సవతి తండ్రి బ్రాండ్ విలియమ్‌సన్ భావోద్వేగంతో బాలుడిని కౌగిలించుకున్నాడు. కాగా, కలని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో అతని తల్లి పోర్చీ...బ్రాండ్ విలియమ్సన్ ను వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాలుడు సవతి తండ్రిని ఈ కోరిక కోరాడు. ఈ వీడియోను పోర్చీ తన ఫేస్ బుక్ లో పోస్టు చేయగా ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News