: జనసేనతో కలిసి పనిచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: సీపీఎం
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో కలిసి పనిచేయడంపై త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆధార్ ఇబ్బందుల కారణంగా దేశంలో 60 శాతం మందికి రేషన్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఏచూరి, దక్షిణ భారతదేశంలో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒక్క తమిళనాడులో 200 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 16 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఏచూరి వివరించారు.