: సామూహిక అత్యాచారాల్లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా టాప్.. వెల్లడించిన రాష్ట్ర హోంశాఖ!
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాజ్‌లోని అహ్మదాబాద్ జిల్లా సామూహిక అత్యాచారాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ తేజశ్రీ పటేల్ అడిగిన ఓ ప్రశ్నకు రాష్ట్ర హోంశాఖ జిల్లాల వారీగా గత ఐదేళ్లలో జరిగిన సామూహిక అత్యాచారాలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఈ ఐదేళ్ల కాలంలో జిల్లాలోని 33 జిల్లాల్లో 29 సామూహిక అత్యాచారాలు జరగ్గా ఒక్క అహ్మదాబాద్ జిల్లాలోనే 17 జరిగినట్టు హోంశాఖ పేర్కొంది. దీనిపై స్పందించిన తేజశ్రీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.