: ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు: నారాయణ

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ లండన్ నుంచి చెన్నై విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు చెన్నై చేరుకోవాల్సిన ఆయన, విమానం ఆలస్యం కావడంతో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. దీంతో ఆయన వేకువ జాము 4 గంటల సమయంలో నెల్లూరు చేరుకున్నారు. అనంతరం ఆయన కుమారుడి మృత దేహాన్ని చూసి భోరున విలపించారు. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచర మంత్రులు ఆయనను ఓదార్చారు. నేడు నిషిత్ నారాయణ అంతిమ సంస్కారం జరగనుంది.