: పెళ్లి వేడుకలో విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి 23 మంది మృతి


సంబరంగా జరుగుతున్న వివాహ వేడుకలో విషాదం అలముకుంది. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షానికి గోడ కూలడంతో పెళ్లి సందడిలో ఉన్న 23 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లోని అన్నపూర్ణ మ్యారేజీ గార్డెన్‌లో అటవీశాఖా ఉద్యోగి కిరోరి మలి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పెళ్లి మండపం గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News