: టెక్ మహీంద్రాలో వందలాది మందికి పింక్‌ స్లిప్‌లు.. పనికిరానివాళ్లను తీసేస్తామన్న టెక్ దిగ్గజం!


అమెరికాలో 10 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ఇటీవల ప్రకటించిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు భారతీయులను పెద్ద ఎత్తున తొలగించేందుకు సిద్ధమైంది. పనితీరు సంతృప్తికరంగా లేని ఉద్యోగులపై వేటేస్తున్నట్టు బుధవారం ప్రకటించి ఉద్యోగుల్లో గుబులు రేపింది. గత కొంతకాలంగా పనితీరు కనబరచని వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు కొందరిని తొలగిస్తున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మధ్య, సీనియర్ స్థాయుల్లోని వందలాదిమంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ బాటలోనే నడుస్తున్న టెక్ మహీంద్ర కూడా ఇప్పటికే వందలమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చింది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లోని వారిపైనా వేటు పడే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

 

  • Loading...

More Telugu News