: అల్లు అరవింద్ సంచలన నిర్ణయం.. భారీ బడ్జెట్‌తో రామకథను 3డిలో తెరకెక్కించనున్న నిర్మాత!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రామకథను 3డీలో నిర్మించాలని సంకల్పించినట్టు బుధవారం తెలిపారు. మధు మంతెన, నమిత్ మల్హోతాతో కలిసి సంయుక్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ రామాయణంలో సీతారాముల పాత్రలు ఎవరు పోషిస్తారన్న విషయాన్ని బహిర్గతం చేయకపోవడంతో మెగా అభిమానుల్లో చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి బ్లాక్ బస్టర్లు అందించిన అరవింద్ ఈసారి తన పంథాకు భిన్నంగా పౌరాణిక చిత్రంపై మొగ్గు చూపడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.