: నిషిత్ ఎవరినీ బాధ పెట్టే వ్యక్తి కాదు: నారా లోకేష్


నిషిత్ నారాయణ చాలా మంచి వ్యక్తి అని, ఎవరినీ బాధ పెట్టే వ్యక్తి కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో నిషిత్ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఈ సంఘటన చాలా బాధాకరం. నారాయణ గారికి నాకు పరిచయం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి. మొదటిసారి నారాయణ గారి ఇంటికి నేను వెళ్లింది 1999లో. అప్పుడు నిషిత్ వయసు బహు:శ మూడున్నరో, నాలుగు సంవత్సరాలో. నా కళ్ల ముందే పెరిగాడు. చాలా సార్లు కలిశాము. చాలా కష్టపడే మనస్తత్వం, ఎవరినీ బాధపెట్టే వ్యక్తి కాదు. నిన్న కూడా ఆఫీసులో కూర్చొని పదకొండు గంటల వరకు పనిచేశాడు. అలాంటిది, ఈ రోజు హఠాత్తుగా యాక్సిడెంట్ లో చనిపోవడం చాలా బాధాకరం’ అని లోకేష్ అన్నారు. నారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News