: ట్రిపుల్ తలాక్ పై నిరసన.. హనుమాన్ చాలీసా పఠించిన ముస్లిం మహిళలు!
ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళల నిరసన రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ట్రిపుల్ తలాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ మస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలంతా ఇక్కడి హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించారు.