: హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారి దారుణం.. అప్పు చెల్లించలేదని పెట్రోల్ పోసి నిప్పంటించాడు!


హైదరాబాద్ లో ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. తన అప్పు చెల్లించలేదనే కారణంతో ఆ వ్యక్తి కుటుంబసభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన బోరబండలోని బంజారానగర్ లో జరిగింది. వడ్డీ వ్యాపారి శ్యామ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వారు బయటకు రాకుండా ఉండేందుకు గేటుకి కూడా నిప్పుపెట్టాడు.ఈ సంఘటనలో వృద్ధుడు యాదగిరి, మనవడు అరుణ్ డెబ్భై ఐదు శాతం కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News