: లోకేష్ తో చెప్పి ఉద్యోగం ఊడగొట్టిస్తానని బెదిరించిన వ్యాపారి!
ఓ వివాదం విషయమై గుంటూరు జిల్లా బాపట్ల మండలం అడవి పంచాయతీ కార్యదర్శిని ఓ వ్యాపారి బెదిరించాడు. కోళ్లఫారాలకు అనుమతుల విషయమై జరిగిన వివాదం కారణంగా పంచాయతీ కార్యదర్శి సుబ్బారావుపై వ్యాపారి నరేంద్ర వర్మ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారి సహా 12 మందిపై పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో, ఆగ్రహించిన నరేంద్ర వర్మ, తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోకపోతే కనుక మంత్రి లోకేష్ కు చెప్పి ఉద్యోగం తీసేయిస్తానని ఆ ఉద్యోగిని బెదిరించారు. కాగా, ఈ విషయాన్ని సదరు ఉద్యోగి తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.