: ఏపీలో జరగాల్సిన గ్రూప్-3 పరీక్ష వాయిదా
ఏపీ రాష్ట్రం నిర్వహించే గ్రూప్-3 పరీక్ష వాయిదాపడింది. జులై 30 వ తేదీన జరగాల్సిన గ్రూప్-3 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తదుపరి ఏ తేదీన నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, గ్రూప్-3 వాయిదా పడటంతో ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరింత సమయం దొరికినట్టయింది.