: బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కేపై సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్ !


బాలీవుడ్ క్రిటిక్, నిర్మాత, నటుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తనదైన శైలిలో పలువురు సినీ నటులపై ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి-2’ చిత్రంపైన, హీరో ప్రభాస్ పైన, దక్షిణాది నటుడు మోహన్ లాల్ పైన ఇటీవల విమర్శలు గుప్పించిన కేఆర్కే, తాజాగా, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘ట్యూబ్ లైట్’ని లక్ష్యంగా చేసుకున్నాడు.

గతంలో విడుదలైన ‘క్యోంకీ’ చిత్రంలో సల్మాన్ మందబుద్ధి పాత్రలో కనిపించాడని, ఆ సినిమా ఘోరంగా పరాజయం పొందిందన్నాడు. ‘ట్యూబ్ లైట్’లో కూడా సల్మాన్ అదే మాదిరి పాత్ర పోషిస్తున్నాడని, ఈ చిత్రం కూడా విజయవంతం కాదేమోననే అనుమానాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేఆర్కే వ్యక్తం చేశాడు. దీంతో, సల్మాన్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే డిలీట్ చేయకపోతే, ఆయన అకౌంట్ ను హ్యాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News