: పవన్ కల్యాణ్ ఆ విషయం తెలుసుకుని మాట్లాడాలి: ఐఏఎస్ అధికారుల సంఘం


టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం స్పందిస్తూ ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల కోసం ఐఏఎస్ లు పనిచేస్తారని, క‌ృత్రిమ అడ్డుగోడలు సృష్టించవద్దంటూ ట్వీట్ చేసింది. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పని చేసే హక్కు ఉందని, ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని ఆ ట్వీట్ లో సూచించారు.

  • Loading...

More Telugu News