: ప్రధాని పదవి చేబట్టే అవకాశాలు వచ్చినా రాహుల్ తిరస్కరించారు: రఘువీరారెడ్డి


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి  ప్రధాని పదవి దక్కే అవకాశాలు  గతంలో రెండు సార్లు వచ్చాయని, అయినా, ఆయన సున్నితంగా తిరస్కరించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో రెండు సార్లు రాహుల్ కు ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చిందని రఘువీరా అన్నారు. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News