: దేశ సమగ్రత విషయంలో మా నిబద్ధత ప్రశ్నించలేనిది: జనసేన
దేశ సమగ్రత విషయంలో తమ నిబద్ధత ప్రశ్నించలేనిదని జనసేన పార్టీ పేర్కొంది. టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తి నియామకాన్ని వ్యతిరేకించడం లేదని, ఉత్తరాదిలోనూ దక్షిణాది వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొంది. పవన్ కల్యాణ్ దేశభక్తిని ప్రశ్నించేవారిది నేతి బీరచందమేనని, పవన్ ట్వీట్ లోని అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ‘జనసేన’ సూచించింది.
కాగా, ఉత్తరాది ఐఏఎస్ అధికారులను తానేమి వ్యతిరేకించడం లేదని, కానీ, ఉత్తరాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అమర్ నాథ్, వారణాసి, మధుర మొదలైన ఆలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా దక్షిణాదికి చెందిన వారిని అనుమతించనప్పుడు, మనమెందుకు వారిని అనుమతించాలని జనసేన పార్టీ అధినేత పవన్ తన ట్వీట్ ద్వారా ఇటీవల ప్రశ్నించడం తెలిసిందే.