: కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎంపీకి చేదు అనుభవం
అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబుకు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది. తన కుమార్తె వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఆయన కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. అయితే, క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఆయనను గేటు వద్దే ఆపివేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గేటు వద్దే ఆపి అవమానించారని మండిపడ్డారు. తన ఐడీ కార్డును చూపించినప్పటికీ లోపలకు పంపకుండా ఎండలో నిలబెట్టారని తెలిపారు. కేవలం కేసీఆర్ మీద ఉన్న ప్రేమతోనే తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. ప్రొటోకాల్ అంటే ఏమిటో సీఎం కార్యాలయ సిబ్బందికి కేసీఆర్ నేర్పించాలని అన్నారు.