: కేసులకు భయపడి జగన్ ప్రధాని కాళ్లపై పడ్డారు: మంత్రి దేవినేని
కేసులకు భయపడి జగన్ ప్రధాని కాళ్లపై పడ్డారని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాుడతూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రధానిని జగన్ కలిశారని, జగన్ ఢిల్లీకి వెళ్లిన విషయం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియదని అన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న జగన్ తో ప్రయాణం చేసే కన్నా చంద్రబాబుతో కలిసి నడవడం మంచిదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు తెలిపారని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో, ఎన్డీఏ సర్కార్ ను తప్పుబట్టిన జగన్ ఇప్పుడెందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.