: క్రాష్ టెస్ట్ లో ఫెయిల్ అయిన డస్టర్ కారు... జీరో స్టార్ రేటింగ్
భారత్ లో తయారైన కార్లలో రెనాల్ట్ డస్టర్ ఈ మధ్య బాగా పాప్యులర్ అయింది. అయితే, ఈ కారు బేస్ మోడల్ మాత్రం అత్యంత కీలకమైన క్రాష్ టెస్టులో విఫలం అయింది. అంతర్జాతీయంగా నిర్వహించే గ్లోబల్ ఎన్ కాప్ క్రాష్ టెస్టులో ఈ కారుకు జీరో స్టార్ రేటింగ్ ఇచ్చారు. వెనుక సీట్లో పిల్లల రక్షణ విషయంలో మాత్రం 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
కార్ల క్రాష్ టెస్టుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రొటోకాల్ ప్రకారం... 56 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు కారు ముందు, పక్క భాగాలను ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో చూస్తారు. అయితే గ్లోబల్ ఎన్ కాప్ మాత్రం 64 కిలోమీటర్ల వేగంతో టెస్ట్ చేస్తుంది. వాస్తవానికి రెనాల్ట్ డస్టర్ బేసిక్ మోడల్ కు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండవు. దీంతో, టెస్టులో ఈ మోడల్ విఫలమైంది. డ్రైవర్ సీట్లో ఎయిర్ బ్యాగ్ ఉండే మోడల్ కు మాత్రం 3 స్టార్ రేటింగ్ వచ్చింది.