: జగన్ ది పచ్చి అవకాశవాదం.. ఆయనకు ముస్లింలు, క్రైస్తవుల నుంచి వ్యతిరేకత వస్తుంది: సీపీఎం
వైసీపీ అధినేత జగన్ పచ్చి అవకాశవాది అంటూ సీపీఎం నేత మధు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వడం సరైంది కాదని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీకి జగన్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. జగన్ వ్యవహారశైలితో వైసీపీకి ముస్లింలు, క్రైస్తవులు దూరమవుతారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీయేకి జగన్ ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీశారు. గెలవలేనప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడం అనవసరమని ఢిల్లీలో జగన్ అన్నారని... అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తామనే ధీమాతోనే జగన్ ఇన్నాళ్లు పోటీకి నిలబెట్టారా? అని ఎద్దేవా చేశారు.