: బాలయ్య 102వ సినిమాకు డైరెక్టర్ ఖరారు
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నందమూరి బాలకృష్ణ స్పీడు పెంచాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా చేస్తున్న బాలయ్య... 102వ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పారు. జూలై 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దర్శకుడు కెఎస్. రవికుమార్ ఇప్పటి వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో నరసింహ, ముత్తు, లింగ... కమలహాసన్ తో దశావతారం వంటి చిత్రాలను తీశాడు.