: అందుకోసమే మోదీ నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారనేది కరెక్ట్ కాదు: జగన్


ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పునరాలోచించాలని చెప్పినట్టు తెలిపారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మోదీని కోరానని అన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక మంచి ఆలోచన అని... దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదేనని జగన్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే తనకు మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారనేది కరెక్ట్ కాదని అన్నారు. ప్రజలకు మంచి చేసే విషయాల్లో బీజేపీకి తాము ఇప్పటి వరకు మద్దతిచ్చామని చెప్పారు. కానీ భూసేకరణ బిల్లు, ప్రత్యేక హోదా అంశాలపై తాము విభేదిస్తున్నామని జగన్ అన్నారు.    

  • Loading...

More Telugu News