: 'బాహుబలి దర్శకుడెవరు?' అంటూ నికీషా పటేల్ ను అడిగిన తెలుగు హీరో!
1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన బాహుబలి చిత్రానికి డైరెక్టర్ ఎవరు? అంటూ ఓ తెలుగు నటుడు తనను అడిగాడని కథానాయిక నికీషా పటేల్ చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే... పవన్ కల్యాణ్ సరసన 'కొమురం పులి' సినిమాలో నటించిన నికీషా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాలో దీనిపై వెల్లడిస్తూ పోస్టులు పెట్టింది. అందులో ఇటీవల ఓ తెలుగు హీరోను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా చూశావా?' అని అడిగాను. దానికి ఆ నటుడు తిరిగి 'ఆ సినిమాకు దర్శకుడెవరు?' అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడని తెలిపింది. దానికి తాను చాలా 'ఆశ్చర్యపోయానని, అతనిని చూస్తుంటే అసహ్యమేసిందని, దీనికి సిగ్గుపడాలని' తెలిపింది. అతని పేరును ఉచ్చరించాలంటే కూడా చిరాగ్గా ఉందని నికీషా పటేల్ తెలిపింది. కాగా, ఇప్పటికే రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలంతా అభినందించడంతో నికీషా పటేల్ తో ఇలా వ్యాఖ్యానించిన హీరో ఎవరై ఉంటారు? అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
I asked one telugu actor "have you watched baahubali replied "who directed that?"How ignorant and stupid and artificial are you..shame on u.
— Nikesha Patel (@NikeshaPatel) May 9, 2017
Feel too ashamed to mention his name.....how daft!
— Nikesha Patel (@NikeshaPatel) May 9, 2017