: నిషిత్ నారాయణ యాక్సిడెంట్ సమయంలో కారు వేగం ఇది!


హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పారిశ్రామిక వేత్త కృష్ణల కుమారులు నిషిత్ నారాయణ, రాజారవిచంద్ర మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ వెల్లడయ్యాయి. కాగా, రోడ్డు ప్రమాదంలో పిల్లర్ ను ఢీ కొట్టిన సమయంలో కారు 200 కిమీ వేగంతో నడుస్తోందని తెలుస్తోంది. దీంతో ఎన్నో జాగ్రత్తలతో తయారైన రెండున్నర కోట్ల రూపాయల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు కూడా వారిని రక్షించలేకపోయిందని తెలుస్తోంది.

డ్యామేజ్ అయిన కారును చూసిన నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. లగ్జరీ కారు ప్రయాణానికి అవసరమైన పూర్తి హంగులతో ఉంటుందని వారు చెబుతున్నారు. సౌకర్యవంతమైన కారులో కాళ్లు చాపుకునే సౌకర్యం కూడా ఉంటుందని, అలాగే ప్రమాదం జరిగినప్పుడు రక్షణగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని వారు చెబుతున్నారు. అలాంటి కారు కూడా ఘోరంగా ధ్వంసమైందంటే వారు మితిమీరిన వేగంతో వెళ్తున్నారని అంచనా వేశారు. అలాగే ఈ కారులోని ఎయిర్ బ్యాగ్స్ కూడా బరెస్ట్ అయిపోగా, ఛాసిస్ లోపలికి నొక్కుకుపోయిందని అంటున్నారు. ఇలాంటి కారు కూడా వారిని రక్షించలేకపోయిందంటే...వారి వేగం అత్యంత ప్రమాదకరమని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News