: శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు: అపోలో ఆసుపత్రి వద్ద చిరంజీవి


హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవిచంద్రల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి... మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియగానే ఆసుపత్రికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబ సభ్యలను ఆయన ఓదార్చారు. ఎంతో భవిష్యత్ చూడాల్సిన పిల్లాడ్ని ఇలా చూడాల్సి రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News