: నా గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి: సచిన్
తన గురించి చాలా విషయాలు తెలుసని అభిమానులు భావిస్తుంటారని... కానీ, అభిమానులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. అందుకే తన జీవిత కథతో తెరకెక్కుతున్న 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా తనను కొత్తగా చూపెడుతుందని అన్నారు. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెరపై చూసుకోనుండటం తనకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో సచిన్ కు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను కూడా చూపించనున్నారు.