: ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగింది: జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువకుడు మృతి చెందాడన్న వేదనతో ఆయన మాట్లాడుతూ, ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆయన ఆక్షేపించారు. రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు.