: నారాయణ కొడుకు కారును రహస్యంగా ఉంచిన పోలీసులు... పలు అనుమానాలు!


ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబర్ 36లో మెట్రో రైల్ పిల్లర్ ను ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఆ కారులోంచి మృతదేహాలను వెలికి తీసిన అనంతరం, కారును కూడా అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియడంతో మీడియా సంస్థలన్నీ ప్రమాదానికి గురైన కారును వెతికే ప్రయత్నం చేశాయి. అయితే కారు మాత్రం కనిపించలేదు.

దీంతో పోలీసులను అడుగగా, తమకు తెలియదని సమాధానం చెప్పారు. ప్రత్యక్ష సాక్షులతోపాటు, ఆ పరిసరాల్లోని వారిని అడుగగా... కారును ఎవరో ప్రైవేటు వ్యక్తులు తరలించారన్న సమాధానం వచ్చింది. దీంతో మరింత లోతుగా ఆరాతీసిన మీడియా సంస్థలు సదరు కారును రహమత్ నగర్ అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ వెనుకనున్న పారిశ్రామిక విద్యాసంస్థకు చెందిన ఖాళీ ప్రదేశంలో గుర్తించాయి. కారును అంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News