: 'కులభూషణ్ ను కాదు.. అతని శవాన్ని పంపుతాం'... భారత ఫుట్ బాల్ సమాఖ్య వెబ్ సైట్లో దుండగుల పోస్ట్


పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన భారతీయుడు కులభూషణ్ శవాన్ని పంపుతామంటూ అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) వెబ్ సైట్లో దుండగులు మెసేజ్ పెట్టారు. అంతేకాదు, అతని ఫొటోను కూడా పోస్ట్ చేశారు. గుర్తు తెలియని దుండగులు ఫుట్ బాల్ సమాఖ్య వెబ్ సైట్ ను హ్యాక్ చేసి, ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

"కులభూషణ్ తిరిగి రావాలనుకుంటున్నారా? అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారా? అతని శవాన్ని పంపుతాం. తీసుకోండి" అంటూ వెబ్ సైట్లో దుండగులు కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య... తమ వెబ్ సైట్ హ్యాక్ అయిందని తెలిపింది. వెంటనే వెబ్ సైట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News