: అపోలో ఆసుపత్రిలో నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చిన పవన్ కల్యాణ్
హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను చూసి విలపించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం పోలీసులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తుంటారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.