: కశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య... ఆర్మీ అధికారి కిడ్నాప్, హత్య


జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా దళాలు తీవ్ర గాలింపులు చేపడుతుండగా... బరితెగించిన ఉగ్రవాదులు షోపియాన్‌ జిల్లాలో లెఫ్ట్‌ నెంట్‌ ర్యాంక్‌ ఆర్మీ అధికారి ఉమర్‌ ఫయ్యజ్‌ కుల్గాం జిల్లాలో బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. దీనిని అవకాశంగా చేసుకున్న ఉగ్రవాదులు గత రాత్రి ఆయనను అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. అనంతరం హెర్మేన్ ప్రాంతంలో ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి, ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News