: రాత్రికి చెన్నై చేరుకోనున్న నారాయణ... రేపు ఉదయం నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు


హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ నిషిత్ నారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాసేపట్లో పోస్టు మార్టం పూర్తైన అనంతరం నిషిత్ నారాయణ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నారాయణ నివాసానికి తీసుకెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు తరలిస్తారు. మరోపక్క, లండన్ పర్యటనలో ఉన్న నారాయణ అక్కడి నుంచి బయల్దేరారు. నేటి సాయంత్రం 8 గంటలకు ఆయన చెన్నై చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఆయన నెల్లూరు పయనమవుతారు. రేపు ఉదయం నెల్లూరులో నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News