: హిందూ, ముస్లిం మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఒక్కటైన దంపతులు
మతాల కంటే మనుషులుగా విలువలతో ఉండడమే ముఖ్యమని నమ్మిన యువతీయువకులు తమ మత సంప్రదాయాలకు భిన్నంగా వివాహం చేసుకున్న ఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే, దుబాయ్ కి చెందిన జునైద్ షేక్, న్యూఢిల్లీకి చెందిన గరిమా ప్రేమించుకున్నారు. వరుడు ముస్లిం కాగా, వధువు హిందూ యువతి. అయినా వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. దేశాలు వేరు, మతాలు వేరు అయినా మనసులు కలవడంతో తమతమ మత సంప్రదాయాలకు భిన్నంగా... వినూత్నంగా వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల హర్షాతిరేకం.. చప్పట్లు .. ప్రశంసల మధ్య తామిద్దరం ఒక్కటయ్యామని వారు ప్రకటించారు. ఈ క్షణం నుంచి తామిద్దరం దంపతులమని ప్రకటించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏప్రిల్ 17న వీరి వివాహం జరగగా...సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.