: పంజాబీ యువతి షాకింగ్ విన్యాసాలు... పోలీసుల జరిమానా... వీడియో చూడండి


పంజాబీ యువతి ద్విచక్రవాహనంపై ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసి, బెంబేలెత్తించిన ఘటన జలంధర్‌ లో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని జలంధర్ కు చెందిన రవీందర్ కౌర్ అనే యువతికి బైక్, ఓపెన్ టాప్ కార్ల రేసింగులంటే చాలా ఇష్టం. ఆ వాహనాలపై విన్యాసాలు చేస్తూ వెళ్లడాన్ని ఆమె చాలా ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌ నుంచి జలంధర్ వెళ్తూ, రోడ్లపై ఆమె చేసిన విన్యాసాలు వాహనదారులను బెంబేలెత్తించాయి.

ఆమె బైక్‌ పై వెళుతూ చేతులు వదిలేసి నిలబడుతూ, పడుకుంటూ ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా...హెల్మెట్‌ ధరించకుండా, కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిందంటూ పోలీసులు ఆమెకు 3 వేల రూపాయల జరిమానా విధించారు. ఆమె చేసిన విన్యాసాలు మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News