: అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ కు చుక్కెదురు...కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై స్టే


'గూఢచారి' ముద్ర వేసి ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై పాకిస్థాన్ కు అంతర్జాతీయ న్యాయస్థానంలో చుక్కెదురైంది. గూఢచర్యానికి పాల్పడ్డాడని పాక్ ఆర్మీ న్యాయస్థానం ఆరోపిస్తూ, అతనికి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పాక్ లోని న్యాయవాదులెవరూ అతని తరపున వాదించకూడదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది.

వ్యాపారం పనిపై ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లిన కుల్ భూషన్ జాదవ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, పాక్ సైన్యానికి విక్రయించారని, ప్రతిగా ఉగ్రవాదులను విడిపించుకుని, నిధులు పొందారని భారత్ ఆరోపించింది. ఈ మేరకు అవసరమైన సాక్ష్యాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో చూపించడంతో కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో పాక్ షాక్ తింది.

  • Loading...

More Telugu News