: అందనంత ఎత్తులో వివాహం... ఎవరెస్టుపై ఒక్కటైన జంట!


ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అత్యంత ప్రత్యేకమైన వేడుక... అలాంటి వేడుకను ఎంత వినూత్నంగా చేసుకుంటే అంత ఆనందంగా ఉంటుందని భావిస్తుంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జేమ్స్‌ (35), అష్లే (32) వివాహం చేసుకోవాని నిర్ణయించుకున్నారు. అయితే అందర్లా కాకుండా వినూత్నంగా తమ వివాహం ఉండాలని అనుకున్నారు. అందుకోసం సంవత్సరకాలంగా ప్రణాళిక రచించి... భూమిమీద అత్యంత ఎత్తైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఎంచుకున్నారు. వెంటనే పర్వతారోహణకు సంబంధించి కొంత కాలంపాటు శిక్షణ తీసుకున్నారు.

 మూడు వారాల పాటు సాగిన వారి పర్వతారోహణలో జేమ్స్‌, అష్లేతో పాటు ప్రఖ్యాత అడ్వెంచర్‌ ఫొటోగ్రాఫర్‌ ఛార్లెటన్‌ చర్చిల్‌ ను కూడా తీసుకెళ్లారు. మంచు పర్వతాలను దాటుకుంటూ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దాదాపు మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో సముద్ర మట్టానికి 14వేల అడుగుల ఎత్తులో మార్చి 16న వారిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. ఎవరెస్టును ఆ జంట అందమైన పెళ్లి దుస్తుల్లోనే అధిరోహించడం విశేషం. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ప్రతి అద్భుత సన్నివేశాన్ని ఛార్లెటన్ తన కెమెరాలో బంధించాడు. వారి వివాహం మధురానుభూతిగా మారింది.

  • Loading...

More Telugu News