: మెట్రోపిల్లర్ ను ఢీ కొట్టిన బెంజ్ కారు... ఏపీ మంత్రి నారాయణ కొడుకు మృతి!
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి ధ్వంసమైంది. ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ టీఎస్ 07 ఎస్ కే 7117 కావడంతో ప్రముఖుల కుమారులే ఆ కారులో ఉన్నారని అనుమానించగా... ఆ కారులో ఉన్నది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రవివర్మ ఉన్నట్టు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది.