: ఫుడ్ పాయిజనింగ్.. ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ!
స్వల్ప అస్వస్థత కారణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టరు డీఎస్ రానా మాట్లాడుతూ, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా రెండు రోజుల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఆమె కోలుకున్నారని, ప్రస్తుతం సోనియా ఆరోగ్యంగానే వున్నారని చెప్పారు. సోనియాను ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.