: సింగర్ చిన్మయి కారును ధ్వంసం చేసిన దుండగులు!
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. తన కారును ధ్వంసం చేసిన దుండగులు అందులోని వస్తువులను ఎత్తుకుపోయారని, కారును ధ్వంసం చేస్తుండగా సమీపంలో ఉన్న వారు కేకలు వేసి అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన ఐదు నిమిషాల తర్వాత కారులో ఉన్న తన వస్తువులు చోరీకి గురయ్యాయనే విషయాన్ని గుర్తించానని, ఇటువంటి సంఘటనలు ఇక్కడ సాధారణమేనని పోలీసులు చెప్పారని చిన్మయి పేర్కొంది.