: నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు
ఆర్ బిఐ పరపతి విధానంతో స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. రెపో రేటును 0.25 శాతం మాత్రమే తగ్గించడంతో అప్పటి వరకూ లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లాయి. బీఎస్ఇ 130 పాయింట్ల వరకూ నష్టపోయి మళ్లీ కోలుకుని ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 19675 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 5975 వద్ద ట్రేడవుతున్నాయి.