: మంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటించనున్న లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మంత్రి హోదాలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో రేపు, ఎల్లుండి పర్యటించే లోకేశ్, హెచ్ సీఎల్ కంపెనీ చైర్మన్ శివనాడర్ తో భేటీ కానున్నారు. హెచ్ సీఎల్ తో ఒప్పందంలో భాగంగా అనుమతి పత్రాలను ఆయన అందజేయనున్నారు.