: కొత్తగా వచ్చిన ఓ టీవీ ఛానెల్ నాపై బురద జల్లుతోంది: శశిథరూర్
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర హత్య వెనుక ఆయన హస్తం ఉందంటూ ఓ జాతీయ టీవీ ఛానెల్ తాజాగా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో శశిథరూర్ స్పందిస్తూ, కొత్తగా మీడియా రంగంలోకి వచ్చిన ఓ ఛానెల్ గుర్తింపు కోసం తాపత్రయ పడుతోందని, ఈ నేపథ్యంలో తనపై బురద జల్లుతోందని ఆయన మండిపడ్డారు.
సునందను హత్య చేశారా? లేదా? అనే విషయమై పోలీసులు ఇంకా నిర్థారణకు రాలేదని అన్నారు. తర భార్య మృతికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పోలీసులకు చెప్పానని అన్నారు. గత మూడేళ్లుగా పోలీసుల విచారణలో ఉన్న అంశాలనే సదరు ఛానెల్ కూడా చూపించిందని, వ్యవస్థలో మీడియాకు చాలా ప్రాముఖ్యత ఉంటే ఉండవచ్చుగానీ, రాజ్యాంగ పరంగా ఓ జడ్జికి లభించేటటువంటి హక్కు మాత్రం మీడియాకు లేదన్నారు.