: ‘హెచ్ టీసీ యూ ప్లే’ స్మార్ట్ ఫోన్ ధర పది వేలు తగ్గింది!


హెచ్ టీసీ యూ ప్లే స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేల వరకు తగ్గింది. రెండు నెలల క్రితమే ఈ ఫోన్ ను విడుదల చేశారు. అప్పుడు, దాని ధర రూ.39,990గా ఉంది. తాజాగా, పది వేల రూపాయలు తగ్గడంతో రూ.29,990కే వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. గొరిల్లా గ్లాసు ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 5.2 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News