: టీచర్ల ప్రవర్తన 'నీట్'గా లేదని.. నలుగురిపై సస్పెన్షన్ వేటు!
రెండు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా నీట్ ఎంట్రన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేరళలోని కన్నూరులో ఓ పరీక్షా కేంద్రంలో ఎంట్రన్స్ రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థినిని డ్రెస్ కోడ్ పేరిట ఆమెను టీచర్లు ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. బ్రా ధరించిన కారణంగా పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థిని అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం నలుగురు టీచర్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, సదరు విద్యార్థిని తనను అనుమతించకపోవడంతో, వెంటనే బయటకు వచ్చిన ఆమె తన టాప్ ఇన్నర్ వేర్ ను తన తల్లి చేతిలో పెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాల్సి వచ్చింది.